About Me

My photo
kakinada, andhrapradesh, India
An invisible… All of you know my attitude very well. But the thing is the opinion about me differs from one to one. I'm sure that no two persons will have similar opinion about me. I'm unique in nature but mutual in doing things. I always do mistakes & flaws and someone will correct me. So this world is helping me and fixing me up as a right human. So i'm loving this world.

Friday, August 26, 2016

గతం చాలా విచిత్రమైనది కదా ...

“” జీవితం గురుంచి ఎంత మాట్లాడుకున్నా ఎప్పుడూ కొత్త గానే ఉంటుంది ఎందుకంటే మాట్లాడుకునే ప్రతి క్షణం కొత్తదే కనుక ... “”
Quotation బాగుందని facebook లో post చేయడానికి మొబైల్ తీసే సరికి birthday notification ... “కోమల్ “ పుట్టిన రోజు .
అది చూడగానే ...అర్థరాత్రి మత్తు నిద్ర లో ఉన్న నన్ను ఉలిక్కి పడేల లేపి వాడు చేసిన అల్లరి చెవులలో కదిలింది ... మనిషి మెదడు మహా విచిత్ర మైనది , అది జ్ఞాపకాలను మాత్రమె గుర్తుపెట్టుకోదు .. జ్ఞాపకాల తాలుక శబ్దాలను , వాటి తో పాటు వచ్చే ఫీలింగ్స్ ని కుడా గుర్తు పెట్టుకుంటుంది ... అందుకేనేమో వాడి గొంతు మరలా చెవులలో ఒక్క క్షణం కదిలింది ..
ఆ నాటి క్షణాలు చాల చాల బాగుంటాయి .. ఎంతలా ఆ క్షణాలను ప్రేమించానంటే ఆ క్షణాలను వదల లేనంత గా , వదిలితే తరవాత వచ్చిన ప్రతి క్షణాన్ని అసహ్యంచు కోనేంత గా .. అందుకే ఇంకొంత సేపు ఆ క్షణాలలో ఉందామనుకొనే లోపు కాలం కుళ్ళు తో నన్ను నిద్ర లేపేసింది ...వచ్చింది కలే ,కాని దానికి ఒక జీవితానికి ఉన్నంత బరువు ఉంది .  కోమల్ తో నా స్నేహం, కాలానికి ఇష్టం లేక వాడిని అమాంతం తనలో కలిపేసుకుంది ...
గతం చాలా విచిత్రమైనది కదా ...
“ అందులో ఆనందించిన క్షణాలను గుర్తు తెచ్చుకుంటే బాధ కలుగుతుంది ,బాధ పడిన క్షణాలను గుర్తు తెచ్చుకుంటే సంతోషం కలుగుతుంది “






Monday, March 14, 2016

ఎదవ గోల

"వాళ్ళ తో మనకెందుకులే ఎదవ గోల" అని నేననుకునే  అతి కొద్ది categories లో "అమ్మాయిల" ది మొదటి స్థానం . తెలిసీ తెలియని టైం లో నాకు తెలుసనుకుని , నాకన్ని తెలుసు నాకు తెలిసినదే కరెక్ట్ అనుకునే ఒక తెలివైన అమ్మాయి ని కెలికి  కళ్ళు తెరుచుకుని అందులోనుండి నీళ్ళు కార్చుకుని నాకెందుకులే ఈ యదవ గోల అనుకుని నా పని నేను చేసుకుంటున్న టైం లో ... చేస్తున్న పని బ్లాక్ అండ్ వైట్ లో ఉండడం వలన కలర్స్ చూడాలన్న కోరిక పుట్టి , కళ్ళకు ఒక రిలాక్సేషన్ వస్తుంది కదా అని అటుగా బుర్ర తిప్పి నపుడు మళ్ళా ఒక అమ్మాయి చెయ్యి ఉపింది ..అటుగా నా కాలు కదిలింది ...మళ్ళా  దూల తీరింది  .
హరివిల్లు ని చూసి ఆనందించాలి గాని , రంగులు బాగున్నాయని దగ్గరకెళ్ళి ముట్టుకోడానికి ట్రై చేయడం ఎంత పిచ్చి తనమో అమ్మయిల మనసు లో ప్లేస్ కోసం ట్రై చేసి మన మనసులో మనకి తెలియకుండానే వాళ్ళని పెట్టేసుకుంటే ఇదిగో ఇలా హరివిల్లు లానే imaginary కలర్స్ ని నిజం అనుకుని వెర్రి వాళ్ళం అయినట్టు అవుతాం . 
ప్రేమ ఈ రోజుల్లో కళ్ళతో దొరకదు , కాళ్ళు అరిగేలా తిరిగినా దొరకదు , ఎంత వెతికినా లవర్ లేని అమ్మాయి , లవర్ ఉన్న అబ్బాయి కనబడరు ...  కాని ఎటు చూసినా ప్రేమ జంటలే కనబడతాయి .
అర్థం పర్థం లేకుండా అస్త వ్యస్తం గా RGV లా రాస్తున్నా అనుకుంటే ... మీరు పొరబాటు పడనట్టే .. మీరు కరెక్ట్ . ఈ అర్థం పర్థం లేని ప్రేమల గురుంచి అర్థ వంతం గా ఎలా రాయమంటారు ?

Tuesday, December 29, 2015

ప్రేమ లేఖ

కనులు ఎంత అందాన్ని చూడగలవు ? నాకు తెలిసి నిన్ను మించిన అందాన్ని చుడలేవేమో,..   
సంగీతం ఏడు స్వరాలనే పలికించగలదా? మరి నీ మాటల స్వరాన్ని నేర్చుకోవడం మర్చిపోయిందేమో..
కెరటాలు సంద్రాన్ని వీడాలనుకొనేది ఎప్పుడు ? ఒడ్డున నువ్వుండి కెరటాలను పాదాలకు తాక నివ్వనపుడెమో..  
ఒక కథ కావ్యమయ్యేది ఎప్పుడు ?నీలాంటి రాకుమారి ఆ కథలో కొచ్చి కవ్వించి నపుడెమో...  

నిను మించిన అందం న కనులకు వద్దు , నీ స్వరం తప్ప నాకే సంగీతం వద్దు , సంద్రపు కెరటం లా నిను తాకలేకపోతే వెనుదిరిగేది కాదు నా ప్రేమ  ... నా జీవితం అనే కథ ను ఓ అద్భుత కావ్యం గ మార్చడానికి వచ్చిన నా రాకుమారి తీసుకో నా హృదయాన్ని ... 

Saturday, November 28, 2015

సైజ్ జీరో సినిమా - నా వ్యూ

(నేను కథ గురు0చే మాట్లాడతా )
ఒక్క మాట లో : కథ లో నీతి ని చెప్పడం ఒక పద్ధతి , నీతి చెప్పడం కోసం కథ చెప్పడం మరో పద్ధతి . .. ఏ పద్ధతి లో చెప్పినా కథ అందం గా ఉంటె నీతి వంటపడుతుంది . లేకపోతే కథ మీద అసహనం తో నీతిని పట్టించుకోరు ... ఈ సినిమా మొదటి భాగం మొదటి పద్ధతి , రెండవ భాగం రెండో పద్ధతి . ఇంకా ఈ సినిమా మీకు ఎలా ఉంటుందో అది మీకు నచ్చిన పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది .
కథ : కథ మొదలైన విధానం చాల బాగుంది . మొదటి భాగం లో ... లావు గా ఉన్న అమ్మాయి కి ఎందుకు పెళ్లి కాదో చెప్పిన వాళ్ళు , లావు గా ఉన్నా సరే ఎందుకు పెళ్లి చేసుకోవచ్చో రెండవ భాగం లో చెప్పాలనుకున్నారు కాని చివర్లో లావు తగ్గే పద్దతుల వలన వచ్చే అనర్థాలను చెప్పడం లో లీనమయిపోయారు  ...
కథనం : కథనం ఆసక్తి గా ఉంటె సినిమా ఫలితం జనరంజితం గా ఉంటది ... ఈ కథనం నెమ్మదిగా , ఓపికగా చూసేలా ఉండడం వలన సినిమా నుండి, చూసే వాడి ఆలోచనలు బయటకెళ్ళి పోతాయి .. ఎప్పుడైనా సినిమా కథనం చూసేవాడి ఆలోచనలను తన చుట్టూనే తిప్పుకునేలా ఉండాలి తప్ప , నిన్న రాత్రి తిన్న ఫ్రైడ్ రైస్ మీదకి వెళ్ళకూడదు ... ఇక్కడ అదే జరిగిందనిపించింది .
చివరగా : కథ నచ్చింది , కథనం నచ్చలేదు . 

Tuesday, November 24, 2015

చంపినా నేరం కానిది .., శిక్ష మాత్రం పడేది

కనులకి కలలకి సంబంధం ఉండుంటే సైటు ఉన్నోల్లకి కలలు మసక గా కనబడేవి , కళ్ళు లేనోల్లకి కలలే వచ్చేవి కావు ... మరి ఇంకెందుకు కళ్ళు చూపించే కష్టాలకు భయపడి కలలను చంపుకోవడం ... 


రేపటి మీద ఉన్న భరోస ఈరోజు  మీద ఉన్న బెంగ ని ఏమీ చేయలేకపోతుంది...ఎం చేస్తాం ! నిన్న వలన వచ్చిన భయం అలాంటిది మరి !!!

కుమారి 21 F సినిమా - నా వ్యూ

ఒక్కమాటలో : సినిమా నాకు నచ్చింది . కొన్ని పాయింట్లు నచ్చలేదు అంతే .
నచ్చినవి : ఈ తరపు "పబ్" యూత్ ఆలోచనలకు దగ్గర గా ఉంది . విల్లెజి యూత్ ఆలోచనలక ఒక 10 ఏళ్ల దూరం గ ఉంది . కథ లో నిజం కన్నా నిజాయితి ఉంది .
అన్ని తెలుగు సినిమాల లానే సరదాగా మొదలయ్యి ఆసక్తి కలిగించే ఇంటర్వెల్ బ్లాక్ ఉంది ... ప్రి క్లైమాక్స్ లో హైప్ ఉంది , క్లైమాక్స్ లో ప్రాణం ఉంది .
మొత్తానికి మేటర్ ఉంది , పాటలు కుదిరాయి .
డైలాగ్స్ సూటిగా ఉన్నాయి ... ఓ పద్ధతి గ ఉన్నాయి .
నచ్చనివి :సుకుమార్ గారు  క్లైమాక్స్ లో 3 యదవల ను సరిగ్గా శిక్షించ లేదనిపించింది .
ఇలాంటి కథను కుటుంబ సమేతం గ చూసే లా తీయగలిగి ఉంటె చాల బాగుండేది కాబి అది అయ్యే పని కాదు . ఈ కథను అల తీయలెం .
చివరి మాట : నాకు కథ అంటేనే మక్కువ అందుకే వేరే క్రాఫ్ట్స్ గురుంచి రాయలేదు ... సినిమా ను మేము యూత్ అనుకునే వాళ్ళు అందరూ చూడొచ్చు అనిపిస్తుంది . 

Saturday, October 31, 2015

గుర్తొస్తున్నావ్ కాని ఎం చేయమంటావ్ ?

Actual గా  నీకో కథ చెప్పాలి . నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది . చిన్నపుడు కలిసి ఆడుకునే వాళ్ళం . 7 క్లాసు లో ఉండగా తను ముంబాయి వెళ్ళిపోయింది . మొన్న facebook లో మాట్లాడుకున్నాం .
పెళ్లి అవ్వి 3 ఏళ్ళు అవ్వింది . తను ఒకపుడు కృష్ణ ని ప్రేమించింది . కానీ తన ప్రేమ ను చెప్పలేదు . కృష్ణ  తనని ప్రేమించలేదు . కానీ తానంటే ఇష్టం . వాడు ఎందుకు ప్రేమించాలేదంటే , వాడు ప్రేమించినా ఇద్దరి ఇళ్ళలోనూ ఒప్పుకోరు , వాళ్ళు ఒప్పుకోకుండా వీళ్ళు ఒక్కటి అవ్వలేరు . అందుకని వాడు ప్రేమించ లేదు , ఈ అమ్మాయి వాడికి ప్రేమను చెప్పలేదు ... కాని వాళ్ళిద్దరి ప్రేమను నాకు చెప్పారు ...
ఆ అమ్మాయి ఒక మాట అంది .. వాడిని పెళ్లి చేసుకోలేనందుకు నాకు బాధ లేదు , ఎందుకంటే మా వారు నన్ను బాగా చూసుకుంటారు , కాని భాధ ఉంది ఎందుకంటే వాడిని ప్రేమించాక వాడిని దూరం చేసుకోడానికే try చేశా తప్ప , ఆనందాన్ని పంచుకోడానికి చూడలేదు , ప్రేమ నుండి పారిపోడానికి పరిగెడుతూ ప్రేమలో ఉన్న happiness , hope , life అన్నిటిని వదిలేసుకున్న .. atleast వాడితో friendship చేసి ఉంటె నా లైఫ్ లాంగ్  ఒక బెస్ట్ ఫ్రెండ్ ల ఉండిపోయేవాడు .. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు తప్ప ఇంకేం లేవు న దగ్గర దాచుకోడానికి , రేపటి కోసం ఎదురు చూడడానికి అంది .
అప్పుడు నాకు అర్థం అవ్వింది ఏంటంటే , పెళ్లి అంటే మన పక్కలో పడుకోడానికి ఒకరికి ఇచ్చే లైసెన్స్ కాదు , మన లైఫ్ ఎసెన్స్ ని చూపించే ఒక బెస్ట్ ఫ్రెండ్ ని తెచ్చుకోడం . ఒక అమ్మాయి జీవితం లో ఒక అబ్బాయి లైఫ్ లాంగ్ ఉండాలంటే వాడు మొగుడు మాత్రమే అవ్వనవసరం లేదు , కానీ ఈ విషయం అర్థం చేసుకోవలసిన అవసరం  మాత్రం మొగుడికి ఉంది అని .  ..
జరిగేది జరుగుతుంది అని అనుకుంటే జీవితానికి కావలసింది చెయ్యి జారిపోతుంది .. అది జరగదు , నువ్వు జరపాలి , నువ్వు పక్కకి జరిగితే అది నీ నుండి జారుకుంటుంది.  అంత అనుకున్నట్టు జరిగితే లైఫ్ అంత ఓ అద్భుతం అవుతుంది , లేకపోతే లైఫ్ లాంగ్ చెప్పుకోడానికి  ఓ అనుభవం మిగులుతుంది . కాని వెనక్కి చూసుకుంటే అన్ని అనుభవాలే తప్ప ఆ అనుభవాలలో ఏ అద్భుతం ఉండనప్పుడు వాటిని నువ్వేం చేసుకు0టావు  ? 

Monday, October 5, 2015

Part 2

ఇంకా గుర్తు ఉంది ... అప్పుడే కళ్ళు తెరిచా ... లేదు లేదు అమ్మ అరుస్తుంటే ఉలికి పడి లేచా . స్కూల్ బస్సు కి time అవుతుంటే ఎంటా మొద్దు నిద్ర అంటూ అమ్మ తన morning raaga ను continue చేస్తుంది . time చూసుకున్నా . 7 అవుతుంది కాని మనసులో 11AM కి జరగ బోయే mathes క్లాసు మాత్రమే కనబడుతుంది . Yes !! ఎందుకంటే నేను homework చేయలేదు ... అది ఆలోచిస్తుంటే ఎక్కడో కొంచెం భయం గ ఉంది ... మా mathes sir కి కొంచెం మెంటల్ .. అరుస్తాడు ,కరుస్తాడు కూడా , అది ఆలోచిస్తూనే అలా అలా నే fast fast గా ready అవ్విస్కూల్ bag వేసుకుని  ID కార్డు వేసుకుని బస్సు catch చేయడానికి పరుగులు పెడుతున్నా ... అప్పుడే బస్సు కదులుతుంటే  చిన్న సైజు chasing చేస్తూ బస్సు steps ఎక్కుతుంటే జారి పడ్డా ...
 O M G ... బస్సు steps ,మీద నుండి జారి బెడ్ మీద నుండి కింద పడ్డాను . yes your guess is right ! ఇప్పటి వరకు జరిగింది కల .. కాని surprise ఏంటంటే ఇప్పుడు కూడా time 7AM .. అమ్మ అరుపుల place లో అలారం కూతలు ఉన్నాయి అంతే తేడా .. వింతగా అదేంటో 11Am ఈ రోజు జరిగే meeting కి నేను సరిగ్గా prepare కాలేదు ! ఇంకా చాల పెండింగ్ tasks ఉన్నాయి . అవన్నీ క్లియర్ చేయాలంటే నేను ఆఫీసు కి తొందరగా వెళ్ళాలి .. అనుకుంటూ  అలా అలా నే fast fast గా ready అవ్విస్కూల్ bag వేసుకుని sorry sorry laptop backpack వేసుకుని ఆఫీసు కి బయలు దేరాను .. cab కుర్చుని పొద్దున్న వచ్చిన కల గురుంచి నాకు తెలియకుండానే ఆలోచన లోనికి వెళ్లాను .
లైఫ్ ఎంత చిత్ర మయినదో కదా ..
android versions update అయ్యినట్టు స్కూల్ బాగ్ laptop bag  అయిపొయింది , స్కూల్ బస్సు కాబ్ లా మారిపోయింది .. స్కూల్ మొత్తం మా ఆఫీసు లా మారిపోయింది .. క్లాసు రూం Team chambers లా మారిపోయింది .. only ID కార్డు ఇప్పుడు ID & access కార్డు అయ్యిపోయింది.. పెండింగ్ home వర్క్స్ ని ఇప్పుడు  పెండింగ్ tasks అంటున్నాం ... అంతే తేడా ! అనుకుంటూ ఆఫీసు లోపలి అడుగు పెట్టాను .

నిట్టూర్పు

చెరువు లోని చుక్కలు చుక్కనంటి నపుడు చింతించ నేలా ,
ఆ చుక్క చినుకయి నేలనంటి నపుడు పుల కించదా నేల ??
పుట్టుక ఎవరికి గిట్టదు , గిట్టుక ఎవరికి పట్టదు ?
నీ చుట్టున్నది చుట్టాల , నువ్వు రాసుకున్న చిట్టాల ?
నువ్వుంటే భారమెవరికి నువ్వు పోతే భాదెవ్వరికి ...
నిను కాపాడేది దేవునికేసిన చందాల ? నువ్వు ముడివేసుకున్న భందాల ?
ఏముందని ఇక్కడ  ఏ మందు ఉంచును నిన్నిక్కడ కాటికి పంపక...
లేని వారి కోసం ఇపుడు నీకున్న కన్నీరు రేపు నువ్వు పోతే ఎవరికిస్తావు పిచ్చివాడ ?